NZB: ముస్తాదురాలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఎచ్వో స్వప్న ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడు షేక్ అబ్దుల్ ఖైజర్ నుంచి 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.