»Shocking Video Young Girl Delhi Metro Rail Video Goes To Viral
Viral Video మెట్రో రైల్ లో బికినీతో అమ్మాయి హల్ చల్
భారతదేశంలో ఉన్నామా? ఇంకెక్కడ ఉన్నామని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్నట్టు ఇక్కడ నడవదు అని కొందరు కామెంట్లు చేశారు. బాహ్య సమాజంలో కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు.
వస్త్రధారణ (Dressing) అనేది శరీరాన్ని కప్పేదే కాదు.. మనిషి గౌరవాన్ని నిలిపేది. అలాంటి వస్త్రధారణను సక్రమంగా వేసుకోవడం లేదు. ముఖ్యంగా చినిగిపోయిన దుస్తులు వేసుకుంటూ దాన్ని ఫ్యాషన్ (Fashion) అంటున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే.. ఈ అంశంపై మాట్లాడుదామంటే మహిళా సంఘాలు (Women Organisations) వెంటనే రంగంలోకి దిగుతాయి. తాము వస్త్రాలు ఎలాంటివి వేసుకోవాలనే స్వేచ్ఛ లేదా? అనే పనికిమాలిన వాదన చేస్తారు. మరి ఢిల్లీ మెట్రో రైల్ లో (Delhi Metro Rail Corporation- DMRC) జరిగిన సంఘటనపై వాళ్లు ఏమంటారు? రెండు గుడ్డముక్కలు వేసుకుని ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలా తిరిగితే ఆ మహిళా సంఘాలు అంగీకరిస్తాయా? ఇలాంటి వాటిని ఖండించాల్సిందే. అసలు ఏం జరిగింది అంటే..
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువతి ప్రయాణం చేసింది. అయితే ఆ అమ్మాయి వేసుకున్న దుస్తులు మరీ చిన్నగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బికినీగా చెప్పవచ్చు. ఆ యువతి అలాగే వేలాది మంది ఉన్న మెట్రో రైలులో ఎంచక్కా ప్రయాణం (Journey) చేసింది. అయితే తోటి ప్రయాణికులు (Passengers) ఆమె తీరుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటి మహిళలు (women) ఆమె పక్కన కూర్చునేందుకు జంకారు. అందరూ ఆ యువతిని వింతగా చూశారు. ఆ యువతి మెట్రో రైలులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారాయి. ఆమె వస్త్రధారణపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
భారతదేశంలో (India) ఉన్నామా? ఇంకెక్కడ ఉన్నామని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్నట్టు ఇక్కడ నడవదు అని కొందరు కామెంట్లు చేశారు. బాహ్య సమాజంలో కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా వేసుకుంటే ఎలా? సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆమె ఆ డ్రెస్ వేసుకోవడాన్ని కొందరు సమర్ధిస్తున్నారు కూడా. ఆమె దుస్తులు ఆమె ఇష్టం అని చెబుతున్నారు.