హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉచిత వైద్య శిబిరం

Advertisement

కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం నందు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి, ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలు వరకూ ఉచిత చిన్న పిల్లలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Advertisement