T20 ప్రపంచకప్లో గ్రూప్ దశ ముగిసింది. రేపటి నుంచి అసలైన సమరం ‘సూపర్-8’ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-2లో భాగంగా తొలి మ్యాచ్లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు.. చెరో మ్యాచ్లో ఓటమిపాలైనప్పటికీ సూపర్-8లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి.