KDP: పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. అనంతరం మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు.