MNCL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక విద్య కమిషన్ సిఫారసులను సవరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు విద్యా కమిషన్ను డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా కమిషన్ సిఫారసులు ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా జీత, భత్యాల గురించి ప్రస్తావించడం దారుణమైన విషయమన్నారు.