GNTR: రాష్ట్ర నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్, ఉండవల్లిలో సీఎం చంద్రబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఇదే సందర్భంగా, సీఎం ఎక్స్-ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ కూడా సీఎంని కలిసి పలకరించారు. పరిపాలనా పరంగా అధికారుల ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.