హైదరాబాద్: 28°C
క్రీడలు

FIH నేషన్స్ కప్: సెమీస్‌లో భారత్

Advertisement

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న FIH నేషన్స్‌ కప్ మహిళల హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్-Aలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన భారత్.. ప్రస్తుతం 6 పాయింట్లతో టేబుల్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీ విజేత వచ్చే ఏడాది జరిగే 'ప్రో లీగ్'కు నేరుగా అర్హత సాధిస్తుంది.

Advertisement

Advertisement