వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ చెత్త ఫీల్డింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను మిస్ చేశాడు. రోస్టన్ ఛేజ్ (15*) ఇచ్చిన సులువైన క్యాచ్ నేలపాలు చేశాడు. దీంతో వికెట్ లేకుండానే పవర్‌ప్లే ముగిసింది. ప్రస్తుతం విండీస్ స్కోరు 6 ఓవర్లకు 45/0గా ఉంది. క్రీజ్‌లో ఛేజ్ (20*), షై హోప్ (25*) ఉన్నారు.