NLG-కట్టంగూరు మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు. అడపాదడపా వర్షాలకు పొలాల్లో దుక్కులు దున్నడం, విత్తనాలు విత్తడం, నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు కొంత మంది మహిళా కూలీలు ఉత్సాహంగా పొలం పనులకు వెళ్లడం ఇవాళ పలు గ్రామాల్లో కనిపించింది.
వార్తలు
మండలంలో రైతు కూలీలు పనులతో బిజీ బిజీ
Advertisement
Advertisement
Advertisement


