AKP: నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో ఆదివారం సైతం పంచాయతీ సిబ్బంది ఆస్తి పన్ను వసూళ్లు బాట పట్టారు. 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు మేరకు సిబ్బంది పని చేస్తున్నారు. గ్రామంలో 748 గృహాలు ఉన్నాయని, రూ. 7.34 లక్షలు రావలసి ఉందని పంచాయతీ సెక్రెటరీ సందీప్ తెలిపారు. ఇంతవరకు రూ. 5.51 లక్షలు వసూలు చేసామన్నారు.