భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి సిద్దమయ్యాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ వాటిని ఖండించాడు. లైక్స్, వ్యూస్ కోసం అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిరాధారమైన వార్తలను నమ్మవద్దని నెటిజన్లను కోరాడు.