VKB: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలెక్టర్ దీపక్ తివారి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అనంతగిరి కొండల్లోని హరిత రిసార్ట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంకి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిశారు. జిల్లా అభివృద్ధిలో తోడ్పడాలని మంత్రి సూచించారు.