సత్యసాయి: ధర్మవరం పట్టణం తుంపర్తి కాలనీలో గత 20 రోజులుగా నెలకొన్న మంచినీటి సమస్యపై మంత్రి సత్యకుమార్ కార్యాలయం తక్షణమే స్పందించింది. నీటి మోటార్ వైర్లు కాలిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు శనివారం కాలనీని సందర్శించారు. అనంతరం త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.