హైదరాబాద్: 28°C
వార్తలు

పట్టపగలే దర్జాగా మొరం తవ్వకాలు – పట్టించుకోని అధికారులు

Advertisement

KMR: మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామంలో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి మొరం వ్యాపారం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్‌కు సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఊర చెరువును యథేచ్ఛగా తోడి గత మూడు రోజులుగా ట్రాక్టర్ల ద్వారా మొరం తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement