AP: కాకినాడలో బాణాసంచా పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వైద్యులను పంపించి తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించారు.