మాల్స్‌లో జీవో నెం.15 ప్రకారం మొదటి 30 నిమిషాల పార్కింగ్ ఉచితం. కానీ, మాదాపూర్, గచ్చిబౌలిలోని కొన్ని మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తూ వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి. వెయిటింగ్ చేయిస్తూ, 30 నిమిషాలు దాటగానే రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నాయి. షాపింగ్ చేసినా గంట ఉచితం అనే నిబంధనను కూడా గాలికొదిలేశాయి.