E.G: కోరుకొండ మండలం మధురపూడి గ్రామానికి చెందిన సోడసాని శ్రీనుకి CMRF ద్వారా మంజూరైన రూ.40,541 విలువగల చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శనివారం అందజేశారు. పేద ప్రజలకు CMRF ఒక వరం అని అన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే CM చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.