రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీపై అంచనాలు పెరిగాయి. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీపై నటి యామీ గౌతమ్ రివ్యూ ఇచ్చింది. ఇది ‘నెక్స్ట్ లెవెల్’ మూవీ అని, ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుందని తెలిపింది. మూవీ చూశాక తాను వేరే దేనిపై దృష్టి పెట్టలేకపోయానంటూ పేర్కొంది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ మూవీ ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.