సూపర్-8 గ్రూప్-2లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుకోగా, కివీస్‌కు మాత్రం ఈ మ్యాచ్ కీలకంగా మారింది. NZ గెలిస్తే గ్రూప్-2 టాపర్‌గా నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఒకవేళ కివీస్ ఓడిపోతే మాత్రం.. వారి సెమీస్ అవకాశాలు శ్రీలంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.