PPM: దుడ్డుకలు నుంచి బీరుపాడు వరకు గ్రామస్థులు సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంను ఇవాళ MPDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైన్ పరిశీలన, నీటి వనరుల శుద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.