మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేవలం కామెడీతో చిరంజీవితో సినిమా తీయడం సాహసమని, తొలి సీన్లోనే పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసి, కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే దీని విజయానికి నిదర్శనమని, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారని తెలిపారు.