VZM: ఎస్ కోట మండలం వెంకటరమణపేటలో తమిళనాడుకు చెందిన రమేష్ మురుగన్ అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. ఈయన ఎస్.కోటలో ఓ షాపులో పనిచేస్తున్నాడని, ఎస్.కోట నుండి వెంకటరమణపేట వైపు వస్తున్న సమయంలో పిట్స్ వచ్చింది. సపర్యలు చేసినప్పటికీ ప్రాణం నిలవలేదని స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ మూర్తి తెలిపారు.