మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గ్యాంగ్ స్టర్ అండ్ గ్యాంబ్లింగ్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీ ‘మట్కా’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రెండో పాటపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ నవంబర్ 14న విడుదలవుతుంది. ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.