AP: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ప్రసవం తర్వాత సాయం కోసం ఓ మహిళ తన చెల్లిని ఇంటికి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే బాలికను బెదిరించి బావ కొద్ది నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. విషయం ఎవరికైనా చెబితే తన అక్కను చంపుతానని బెదిరించాడు. స్వగ్రామానికి వెళ్లిన తర్వాత కూడా బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.