స్టాక్మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80,220 వద్ద ముగిసింది. నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24,472 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది. చివరి సెషన్లో అమ్మకాలకు ఒత్తిడి ఏర్పడింది. దీంతో ఆటో, మెటల్, ఆయిల్ షేర్లకు భారీ నష్టం వాటిల్లింది.