కన్నడ నటుడు దర్శన్ బెయిల్ పిటిషన్పై ఇవాళ కర్ణాటకలోని హైకోర్టులో విచారణ జరిపారు. అనారోగ్య కారణాలు చూపుతూ పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ ఆరోగ్యంపై హైకోర్టు.. వైద్యుల నివేదిక కోరింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.