విజయనగరం: వ్యాన్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన ఘటన రంగరాయపురం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్.కోట ఎస్సై రామకృష్ణ వివరాల మేరకు గొల్జాం గ్రామానికి చెందిన టి.రామకృష్ణ(34) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని గ్రామానికి వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
వార్తలు
వ్యాన్ ఢీకొని యువకుడు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement


