NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల BA తృతీయ సంవత్సరం చదువుతున్న వి. ధనుష్ తెలంగాణా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ తెలిపారు. సంస్థ 35 వేల చెక్కుతో పాటు మెమొంటో అందించినట్లు తెలిపారు. త్వరలో గోవాలో జరుగు జాతీయ స్థాయిలో 10కే రన్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.