అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. తమపైకి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే US పూర్తి బాధ్యత వహించాలని వెల్లడించింది. US అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి తమకు తెలుసని తెలిపింది. ఆయన ఇజ్రాయెల్ ప్రతీకార దాడులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనకరమైనవని, రెచ్చగొట్టేలా ఉన్నాయని USలోని ఇరాన్ రాయబారి అమీర్ విమర్శించారు. ఇటీవల ఇరాన్ క్షిపణుల దాడులపై ఇజ్రాయెల్ తీర్చుకునే ప్రతీకార దాడులపై అవగాహన ఉందని బైడెన్ తెలిపారు.