KDP: జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రాన్ని సందర్శించగా అక్కడ కేదార్నాథ్ జగద్గురు బీమాశంకర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు ఆయనదర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందారు. మహారాష్ట్రలో జరగనున్న శాసనసభ ఎన్నికలు, అలాగే నాందేడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తరపున ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు.