ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కొండపి మండలం కే.ఉప్పలపాడు గ్రామానికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
క్రైమ్
డివైడర్‌ను ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


