CTR: చిత్తూరు నగరంలోని వన్ టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో మంగళవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడవచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.