బాణాసంచా విక్రయాలకు అనుమతించే ప్రసక్తే లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. బాణాసంచా నిల్వ, విక్రయాల కోసం శాశ్వత లైసెన్సులు కలిగిన వ్యాపారులంతా కలిసి ‘ఢిల్లీ ఫైర్ వర్క్స్ షాప్ కీపర్స్ అసోసియేషన్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.