ఎమర్జింగ్ ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత్ ఎ జట్టుకు వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈ-ఎతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత యూఏఈని 107 పరుగులకే కట్టడి చేసిన భారత్.. లక్ష్యాన్ని 10.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (58) మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్ తదుపరి మ్యాచ్‌లో బుధవారం ఒమన్‌తో తలపడనుంది.