GNTR: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో బుధవారం తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.