హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ దసరా. ఆశ్వయుజ మాసంలో ఈ పండుగను పది రోజులపాటు జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం దుర్గాదేవి.. మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్దం చేసి వధించింది. ఈ విజయానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. మరోవైపు పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు. దీంతో దసరా రోజున జమ్మిచెట్టుకు పూజ చేయటం సాంప్రదాయంగా మారింది.