GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా జనగణన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లు, ఎన్యుమరేటర్ల బాధ్యతలు అత్యంత కీలకమని తెలిపారు. డిజిటల్ యాప్ల ద్వారా నిర్వహించనున్న జనగణనలో నాణ్యమైన డేటా సేకరణకు పూర్తి అవగాహనతో పాటు సమర్థ పర్యవేక్షణ అవసరమని సూచించారు.