NLG: దేవరకొండ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ ప్రజాతంత్ర బాధ్యులు నల్ల వెంకటయ్య ఈ దీక్షలో కూర్చున్న సభ్యులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.