ADB: రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ఉట్నూర్‌లోని ‘వికాసం’ ప్రత్యేక బాలల పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించి సత్తా చాటారు. విజేతలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. వైకల్యం అనేది ప్రతిభకు అడ్డుకాదని విద్యార్థులు నిరూపించారని కొనియాడారు. వీరికి భవిష్యత్తులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.