తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారనే ఆరోపణలపై సిట్ విచారణకు ఆదేశించాలని కోరారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను అగౌరవపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలవర పెడుతోందన్నారు.