మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న వేల్పుల భీమయ్య అనే ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్, కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, విజయరాణి తిరుపతి, మున్సిపల్ అధికారులు సాయికుంటలోని నివాసానికి వెళ్లి భీమయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు.