BHPL: గణపురం (M) కేంద్రంలోని మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ మొదలైంది. 6వ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HM తిరుపతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు TGMS అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని HM సూచించారు.