Gold Rates Today : స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు అప్ ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. సోమవారం బంగారం ధర దాదాపుగా స్థిరంగా ఉండగా, వెండి ధర మాత్రం బాగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : ఇది పసిడి కొనుగోలుదారులకు అనుకూలమైన సమయం కాదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు అప్ ట్రెండ్‌లోనే కొనసాగుతున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర దాదాపుగా స్థిరంగానే ఉంది. రూ.12 పెరిగి రూ.73,365కు చేరుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, విజయవాడ తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,365గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. తర్వాత వీటి ధరల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాగే కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ ధరకు తోడుగా మజూరీ, జీఎస్టీ ల్లాంటివి అదనంగా యాడ్ అవుతాయని గమనించుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర(Silver Rate)సోమవారం రూ.391 పెరిగింది. దీంతో నేడు దీని ధర రూ.91,180కు చేరుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, విజయవాడల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2294 డాలర్లు ఉండగా సోమవారానికి అది డాలరు మేర పెరిగి 2295 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 29.45 డాలర్లుగా ఉంది.