సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ ఫాంటసీ హారర్-కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి వీకెండ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.80 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.