ADB: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం కొనసాగుతుందని ASU జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోశ్ స్పష్టం చేశారు. ఇంద్రవెల్లిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ప్రభుత్వం పెసా, 1/70 చట్టాలను గాలికొదిలేసిందని విమర్శించారు. ఏప్రిల్ 14న నిర్వహించే మహా ర్యాలీని విజయవంతం చేయాలని, యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.