ATP: జిల్లాలో పలు మున్సిపాలిటీల వార్డుల సంఖ్య పెరిగింది. గుంతకల్లో 37 వార్డుల నుంచి 48కి, తాడిపత్రి 36 నుంచి 48కి పెరిగాయి. రాయదుర్గంలో 32 నుంచి 40కి, గుత్తిలో 25 నుంచి 32కి వార్డుల సంఖ్య పెరిగింది. అలాగే కళ్యాణదుర్గంలో 24 నుంచి 32కి వార్డులను పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.