AP: వైసీపీ నేతలు ధర్మాన, బొత్స సత్యనారాయణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మూలపేట పోర్టు పరిశీలనకు 40 మందికి అనుమతి ఇచ్చినా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మళ్లీ వెళ్తామన్నా అనుమతిస్తామని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కనిపించకపోతే భూతద్దాలు ఇప్పిస్తామంటూ ఎద్దేవా చేశారు.