హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

MDK: ​రామాయంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులకు ప్రిన్సిపల్ హిమజ్యోతి ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిజిటల్ తరగతులు, ఉచిత బస్ పాస్, స్కాలర్‌షిప్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రైవేట్‌కు దీటుగా బోధన ఉంటుందని, విద్యార్థులు చేరాలని కోరారు. ఇందులో అధ్యాపకులు బాలప్రకాష్, ఆంజనేయులు పాల్గొన్నారు.