SRD: నిజాంపేట మండలం నాగ్దర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జేబా షాహమిన్ బుధవారం సందర్శించారు. ఈ మేరకు స్థానికంగా కొనసాగిన NCD క్యాంపు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో గర్భవతులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఆమె వైద్య పరీక్షలు చేశారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యం కోసం సకాలంలో పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.